తొమ్మిది నెలల పాప దారుణ హత్య.. కన్నతండ్రే కాలయముడా..?

by Vinod kumar |
తొమ్మిది నెలల పాప దారుణ హత్య.. కన్నతండ్రే కాలయముడా..?
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బాపన్ గుట్ట తండా లో ఆదివారం అదృశ్యమైన 9 నెలల పసిపాప ప్రియ సోమవారం సమీపంలోని వెంచర్ లో శవమై కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. 9 నెలల పసిపాప ప్రియ ఆదివారం నుండి కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాప ఫోటో విడుదల చేసి ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.


సోమవారం సమీపంలోని చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో సంచి కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సంచి విప్పి చూడగా అదృశ్యమైన ప్రియ శవంగా కనిపించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా కుటుంబం సతమతం అవుతుండటంతో తండ్రి నరేష్ కన్నకూతురిని హతమార్చినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story