నింబూజ్ నిమ్మరసమా లేక పండ్ల రసమా.. సుప్రీంకు చేరిన పంచాయతీ

by Harish |
నింబూజ్ నిమ్మరసమా లేక పండ్ల రసమా.. సుప్రీంకు చేరిన పంచాయతీ
X

న్యూఢిల్లీ: బహుళ జనాదరణ పొందిన సాఫ్ట్ డ్రింక్ నింబూజ్ అనేది నిమ్మరసమా లేక పళ్ల గుజ్జా లేక పళ్ల రసమా అనే పంచాయితీని తేల్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశాన్ని పరిష్కరించిన తర్వాత నింబూజ్ ఉత్పత్తిపై ఎంతమేరకు ఎక్సైజ్ పన్ను విధించవచ్చో నిర్ణయమవుతుంది. జస్టిస్ ఎమ్ ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్‌ని విచారిస్తుందని మార్చి 11న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రకటించింది. 2015 నుంచి ఈ కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత నింబూజ్ వర్గీకరణ మార్పు చెందుతుంది.

నింబూజ్‌కి ప్రస్తుతం ఉన్న పళ్ల గుజ్జు లేదా పళ్ల రసం స్థితికి బదులుగా నిమ్మరసం అని వర్గీకరించాలని కోరుతూ ఆరాధన ఫుడ్స్ అనే కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఏప్రిల్‌లో దీనిపై సుప్రీంకోర్టు విచారణ సాగించవచ్చని భావిస్తున్నారు. నింబూజ్ ఉత్పత్తిని పెప్సీకో 2013లో ప్రవేశపెట్టింది. ఆనాటి నుంచి దాన్ని నిమ్మరసం అనవచ్చా లేక పండ్ల రసం అని వర్గీకరించవచ్చా అనే అంశంపై చర్చ జరుగుతూనే ఉంది.

Advertisement

Next Story

Most Viewed