- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nidhhi Agerwal: అలాంటి క్యారెక్టర్స్ తప్పకుండా చేస్తా.. హాట్ బ్యూటీ
దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన కెరీర్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. బిగినింగ్ డేస్‌లో అక్కినేని వారసులతో రెండు సినిమాలు చేసిన భామకు పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో చేసిన గ్లామర్ రోల్‌తో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాతి నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నట్లు లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన నటి.. తాను మాత్రం తొందరపడే ప్రసక్తి లేదంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతే క్రేజ్ తగ్గిపోతుందని, అందుకే ఆచితూచి అడుగేస్తున్నానని చెప్పింది. ఇండస్ర్టీలో స్టార్‌డమ్ సొంతం చేసుకోవాలంటే ఓపిక, సహనం ఉండాలంటున్న బ్యూటీ.. తాను అదే సూత్రం ఫాలో అవుతున్నట్లు పేర్కొంది. అయితే వరుసగా మంచి పాత్రల్లో నటించే అవకాశమొస్తే తప్పకుండా స్వీకరిస్తానంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నిధి ప్రస్తుతం పవన్‌తో 'హరి హరవీరమల్లు'లో నటిస్తుంది.