- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లిపాక సొసైటీలో కోటి రూపాయల అవినీతి.. అక్రమార్కులను కాపాడుతున్నదెవరు?
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక సొసైటీలో గత సహకార సంఘం పాలక మండలి కోటి రూపాయల పైచిలుకు అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు మండల వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. సహకార సంఘంలో భారీ ఎత్తున అవినీతి జరిగినా.. అధికారులు మాత్రం తాత్కాలిక విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. నెల్లిపాక సోసైటీలో 2013-2018 కాలం నాటి పాలకమండలి రూ.కోటి రూపాయల పైగా అవినీతి చేశారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాటి డిస్టిక్ కో-ఆపరేటివ్ అధికారి మైఖేల్ బోస్ అవినీతిపై విచారణ చేపట్టారు. అయితే, ఈ క్రమంలో అధికారులు బదిలీ కావడంతో విచారణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. అవినీతి జరిగిందనే ఆరోపణలతో విచారణ చేపట్టుతుంటే అధికారపార్టీ నేతలు కావాలనే అధికారులను బదిలీ చేశారనే ఆరోపణలు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిస్టిక్ కో-ఆపరేటివ్ అధికారి డి.వెంకటేశ్వరరావు నేతృత్వంలో 51వ విచారణ అధికారిగా డి.రాజును నియమించారు. విచారణ అధికారి డి.రాజు నవంబర్ 5 తేదీన విచారించి, సంఘంలో గత పాలకమండలి సభ్యులు రూ.కోటి 92 లక్షలు అవినీతికి పాల్పడ్డారని నిర్ధారించారు. దీనిపై ఉన్నతాధికారులు నోటీసులు అందజేసినా అవినీతి చేసిన వ్యక్తులపై చర్యలు చెప్పటకపోవడం గమనార్హం. అసలు ఈ కుంభకోణానికి పాల్పడింది ఎవరు...? అవినీతి చేసిన వ్యక్తులను కాపాడుతున్నదెవరు...? అసలు రైతులకు న్యాయం జరుగుతుందా..? లేక అన్యాయమే జరుగుతుందా? అనేది మండలంలో ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉండగా, బుధవారం సహకార సంఘంలో రైతులు ఆందోళన చేపట్టారు. 2021-2022 సహకార సంఘం లెక్కల ముగింపు అనంతరం 2013-2018 కాలంలో జరిగిన సహకార సంఘ లెక్కల వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారని రైతులు నిలదీశారు. బుధవారం జరిగిన సమావేశానికి డిస్టిక్ కో-ఆపరేటివ్ అధికారి ఎందుకు హాజరు కాలేదని.. ఈ కుంభకోణం వెనుక ఎంతమంది హస్తం ఉందని రైతులు ప్రశ్నించారు. లెక్కల వివరాలను తేల్చకపోతే విషయం సీరియస్‌గా ఉంటుందని రైతులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.