పంజాబ్ ప్రజలు అద్భుత నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ

by Harish |
పంజాబ్ ప్రజలు అద్భుత నిర్ణయం తీసుకున్నారు: కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ
X

ఛంఢీగఢ్: పంజాబ్‌లో ఆప్ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ఇదో రాజకీయ మార్పు అని అన్నారు. 'కొత్త వ్యవస్థకు నాంది పలికేందుకు అద్భుత నిర్ణయం తీసుకున్నందుకు పంజాబ్ ప్రజలకు నా అభినందనలు' అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును ఎంచుకున్నారని, వారు ఎన్నటికీ తప్పు చేయరని ఆయన అన్నారు. పంజాబ్ అభ్యున్నతే తన ధ్యేయమని, దాని నుండి తాను తప్పుకునే ప్రయత్నం చేయనని తెలిపారు. ఎన్నికల గెలుపోటములతో నాకు ప్రజలతో బంధంలో మార్పు ఉండదు. పంజాబ్ ప్రజల్లో నేను దేవుడిని చూస్తాను. వారి సంక్షేమమే నా సంక్షేమం' అని అన్నారు. తూర్పు అమృత్ సర్ నుంచి బరిలోకి దిగిన సిద్ధూ ఆప్‌కు చెందిన వాలంటీర్ జీవన్ జ్యోత్ కౌర్ చేతిలో 6వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు.



Advertisement

Next Story