- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nikhil Siddharth: ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాము.. జాతీయ అవార్డు వరించడంపై నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: 70వ జాతీయ చలనచిత్ర అవార్డు (National Film Award)వేడుక ఢిల్లీ(Delhi)లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 2022కు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ-2’ (Karthikeya-2)జాతీయ అవార్డు గెలిచింది. ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)చేతుల మీదుగా అందించగా.. ‘కార్తికేయ-2’ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Producer Abhishek Agarwal) స్వీకరించారు. దీనిపై ఈ సినిమాలో హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha)ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
‘‘కార్తికేయ-2’ చిత్రం యూనిట్ పడిన కష్టానికి ఓ మధురమైన బహుమతి ఇది. ఈ స్క్రిప్ట్‌పై మొదటి రోజు నుంచే మాకున్న నమ్మకం, జాతీయ అవార్డు రూపంలో ఫలితం దక్కింది. చలి, వేడి, వర్షం, బురద ఇలా ప్రతి వాతావరణ పరిస్థితిలో ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. ప్రతి రోజు మాకు ఓ సవాల్‌లా ఉండేది. అన్నిటికంటే కష్టమైన సవాల్.. పరిమిత బడ్జెట్‌లో క్వాలిటీగా సినిమా తీయడం. ఇలా ప్రతి సవాల్‌ను అధిగమించి, ఇప్పుడు జాతీయ అవార్డ్ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజును నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చింది.