మనసు, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయా.. హాట్ బ్యూటీ

by Harish |
మనసు, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోయా.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ.. చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీకి సిద్ధమైనప్పటికీ అనేక కారణాలు ఎలా అడ్డుకున్నాయో తాజా ఇంటర్వ్యూలో వివరించింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్న భామ.. మళ్లీ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేందుకు ముంబైకి తిరిగొచ్చే ప్రణాళికలన్నీ కరోనా మూలంగా ఆలస్యమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 2020లో 10 రోజుల మెడిటేషన్ రిట్రీట్‌లో చేరానన్న నర్గీస్.. అది కంప్లీట్ చేసేసరికి కొవిడ్ వల్ల జీవితం స్తంభించిపోవడం చూసి షాక్ అయ్యానని పేర్కొంది. తాను ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవగానే లోకం తలుపులేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక వృత్తిరిత్యా ఎన్నోసార్లు ఒత్తిడికి గురయ్యానన్న నర్గీస్.. కుటుంబం, స్నేహితులకు దూరమవుతూ సంతోషాన్ని కొల్పోయానని చెప్పింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంవల్ల మనసు, శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకే ఇంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story