నా తల్లికి అవమానం జరిగింది: నారా లోకేశ్

by Disha Desk |
నా తల్లికి అవమానం జరిగింది: నారా లోకేశ్
X

దిశ, ఏపీ బ్యూరో : శాసనసభ సాక్షిగా నా తల్లికి అవమానం జరిగింది. ఇది ఏ ఒక్క మహిళకో జరిగిన అవమానం కాదు.. రాష్ట్ర మహిళలందరికీ జరిగిన అవమానం. మంత్రులు క్షమాపణ చెప్పే వరకు చట్టసభలకు వెళ్లరాదని పొలిట్ బ్యూరోలో మెజారిటీ సభ్యులు సూచించారు. నా త‌ల్లికి మంత్రులు క్ష‌మాప‌ణ‌లు చెబితే అప్పుడు అసెంబ్లీకి హాజ‌రు ఆలోచిస్తాం'అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరయ్యే అంశంపై టీడీఎల్పీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంత్రుల చేత క్షమాపణ చెప్పే వరకు అసెంబ్లీ, శాసన మండలి కి వెళ్లకూడదని పోలిట్ బ్యూరో అభిప్రాయ‌ప‌డిందని చెప్పుకొచ్చారు. న్యాయం రైతుల వైపు ఉంది. సుప్రీం కోర్టుకు వెళ్లే హక్కు జగన్ రెడ్డికి ఉందంటూ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు.



Advertisement

Next Story