- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss 8 : మీకు దండం పెడతా.. నన్ను ఇక్కడి నుంచి పంపించేయండంటూ ఏడ్చిన నాగ మణికంఠ
దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా చాలామంది వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ వారం ఎలిమినేషన్స్ లో యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, గౌతమ్, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, హరితేజ.. ఇలా మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. అయితే, ఈ వారం తెలిసిన సమాచారం ప్రకారం నాగ మణికంఠ ఎలిమినేట్ అవుతాడని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో కెమెరా ముందుకు వచ్చి.. బిగ్ బాస్ " ఈ గొడవలు, కొట్లాటలు నా వల్ల అసలు కావడం లేదు నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి, ఆడియెన్స్ మీరు నాకు అసలు ఓట్లు వేయకండి" అంటూ బాగా ఏడ్చాడు నాగమణికంఠ. ఇక శనివారం వచ్చిన ఎపిసోడ్ లో నాగార్జునతో .. " నాకు హెల్త్ బాగలేదు, నా శరీరం, నా మైండ్ అసలు సపోర్ట్ చేయడం లేదు. నేను చాలా వీక్ అయిపోయాను నేను వెళ్ళిపోతాను సార్ " అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే, అతని మాటలు విన్న తర్వాత నాగార్జున ప్రేక్షకుల ఓటింగ్ మీదే ఆధారపడి ఉంటుందని అన్నాడు. దీంతో ఈ వారం నాగమణికంఠని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. మరి, ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుంటే ఈ రోజు రాత్రి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.