Naga Chaitanya డబుల్ ధమాకా.. తమిళ్ డైరెక్టర్‌తో బైలింగువల్

by Mahesh |   ( Updated:2022-04-06 07:46:24.0  )
Naga Chaitanya డబుల్ ధమాకా.. తమిళ్ డైరెక్టర్‌తో బైలింగువల్
X

దిశ, సినిమా : 'లవ్ స్టోరీ' సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదే క్రమంలో కోలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన చైతు.. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో మూవీ చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌లో తెలుగు, తమిళ్‌లో బైలింగువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న #NS22 వివరాలను డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 'చై' తో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ 'తెలుగు ప్రేక్షకుల్లో నాగ చైతన్య కు ఉన్న ఇమేజ్ గురించి తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఒక విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాను.

ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. స్టార్ కాస్టింగ్‌తో పాటు పాపులర్ టెక్నీషియన్స్‌ ఈ సినిమాకు పనిచేయబోతున్నారు' అని తెలిపారు. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. అదే నిజమైతే ఈ జంట ఏడేళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనుండగా.. ఇంకా అఫిషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.

Advertisement

Next Story