- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్
by Vinod kumar |
X
ఇంఫాల్: మణిపూర్‌లో సీఎం అభ్యర్థిపై బీజేపీ స్పష్టత ఇచ్చింది. మరోసారి బిరేన్ సింగ్‌కే పట్టం కట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్‌ను ఖాయం చేసింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు మణిపూర్‌లో ఈ ప్రకటన చేశారు. దీంతో బిస్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్‌చంద్‌లకు నిరాశే ఎదురైంది.
సీఎం విషయమై శనివారం ముగ్గురు నేతలు బీజేపీ అధిష్టానాన్ని కలిసిన సంగతి తెలిసిందే. మాజీ ఫుట్‌బాలర్, జర్నలిస్టు అయిన ఈ 61 ఏళ్ల బిరేన్ సింగ్ మణిపూర్‌లో బీజేపీ మరోసారి గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించారు. కాగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 32 సీట్లలో గెలుపొంది, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story