- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నగరపాలక సంస్థ ఆదాయం పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఆదాయం పెంపొందించుకోవాలని, ఆస్తి పన్నులను పకడ్బందీగా వసూలు చేయాలని, భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కరీంనగర్ నగర పాలక సంస్థ 2022- 2023 బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మేయర్ వై. సునీల్ రావు అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్తి పనులను పకడ్బందీగా వసూలు చేయాలని సూచించారు.
భవన నగరపాలక సంస్థకు వచ్చే బడ్జెట్‌లో 10 శాతం బడ్జెట్‌ను హరితహారంకు కేటాయించాలని తెలిపారు. హరితహారం కోసం నర్సరీలను నిర్వహించాలని అధికారులకు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసులను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడంలో కార్పొరేటర్లు, నగరపాలక సిబ్బంది చేసిన కృషి గణనీయమైనదని కొనియాడారు. అలాగే బూస్టర్ డోసుల విజయవంతానికి కూడా కృషి చేయాలని కోరారు. పాలకవర్గం సమష్టి సహకారంతో నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో మేయర్ వై.సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.