చిన్న జీయ‌ర్ స్వామిపై ఎమ్మెల్యే సీత‌క్క ఫైర్..

by Vinod kumar |
చిన్న జీయ‌ర్ స్వామిపై ఎమ్మెల్యే సీత‌క్క ఫైర్..
X

దిశ, ఏటూరునాగారం: వ‌న‌దేవ‌త‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయ‌ర్ స్వామిపై ములుగు ఎమ్మెల్యే సీత‌క్క తీవ్రంగా మండిప‌డ్డారు. గురువారం సీత‌క్క మేడారం స‌మ్మక్క సార‌ల‌మ్మ దేవ‌త‌ల‌ను దర్శించ‌కున్నారు. అనంత‌రం ఆమె విలేక‌రులతో మాట్లాడుతూ.. ఆంధ్రకు చెందిన చిన్న జీయ‌ర్ స్వామి మ‌న తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిక‌లు అయిన స‌మ్మక్క సార‌ల‌మ్మల‌పై అహంకార పూరిత‌మైన మాటల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని బేష‌ర‌తుగా క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.


మా త‌ల్లుల‌ది వ్యాపార‌మా, మా దేవ‌త‌ల ద‌ర్శనానికి ఒక్క రూపాయి కూడా టిక్కెట్ లేదు.. కానీ మీరు పెట్టిన 120 కీలోల బంగారం స‌మ‌తామూర్తి విగ్రహ ద‌ర్శనానికి మాత్రం రూ.150 ధ‌ర పెట్టి వ్యాపారం చేస్తున్నార‌ని సీత‌క్క విమ‌ర్శించారు. కానీ మా స‌మ్మక్క సార‌ల‌మ్మ త‌ల్లుల ద‌గ్గర ఎలాంటి వ్యాపారం జ‌ర‌గ‌డం లేద‌న్నారు.


తెలంగాణ ప్రభుత్వం వెంట‌నే రియ‌ల్ ఎస్టేట్ స్వామి అయిన చిన్న జీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్యల‌పై స్పందించి తగిన బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు న‌ల్లెల కూమార స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ ర‌విచంద‌ర్‌, తాడ్వాయి, ములుగు మండ‌లాల అధ్యక్షుడు జ‌ల‌పు అనంత రెడ్డి, స‌హ‌కార సంఘం చైర్మన్ పులి సంప‌త్ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిరిల వెంక‌న్న, స‌ర్పంచ్ రేగా క‌ళ్యాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story