Akash Ambani: రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ నియామకం!

by GSrikanth |   ( Updated:2022-06-28 12:24:48.0  )
Mukesh Ambani Resigns From Board of Jio, Akash Ambani named new Chairman
X

ముంబై: Mukesh Ambani Resigns From Board of Jio, Akash Ambani named new Chairman| దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తనయుడు ఆకాష్ అంబానీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దీనికి సంబంధించి కంపెనీ డైరెక్టర్ పదవీ నుంచి వైదొలగినట్టు జియో మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే సమయంలో కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఆకాష్ అంబానీని కొత్త బోర్డు ఛైర్మన్‌గా ప్రకటించింది.

డైరెక్టర్ పదవికి ప్రస్తుతం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న పంకజ్ మోహన్ బాధ్యతలను నిర్వహించనున్నారు. అంతకుముందు సోమవారం రోజున జరిగిన కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అలాగే, రమీందర్ సింగ్ గుజ్రాల్, కె వి చౌదరీలను కంపెనీ అడిషనల్ డైరెక్టర్లుగా నియమించారు. వీరు జూన్ 27 నుంచి ఐదేళ్ల పాటు కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. దీనికోసం షేర్ హోల్డర్ల ఆమోదం రావాల్సి ఉంది. దేశీయంగా ఈ ఏడాది ఆఖరు నాటికి 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆకాష్ అంబానీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story