అయితే, మాంసం షాపులు బంద్ చేస్తరా..? : ఎంపీ మోయిత్రా

by S Gopi |
అయితే, మాంసం షాపులు బంద్ చేస్తరా..? : ఎంపీ మోయిత్రా
X

న్యూఢిల్లీ: హిందువుల పండుగ నవరాత్రి సందర్భంగా దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలపై నిషేధం విధించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తప్పుబట్టారు. రాజ్యాంగం భారత పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛ కాలరాస్తున్నారంటూ ట్విట్టర్ లో ఆమె మండిపడ్డారు.

అయితే, సోమవారం, దక్షిణ ఢిల్లీ మేయర్ ముఖేష్ సూర్యన్ "దుర్గా దేవికి అంకితమైన నవరాత్రుల పవిత్రమైన కాలంలో" తన పౌర సంస్థ క్రింద మాంసం దుకాణాలను మూసివేయాలని ప్రకటించారు, ఈ తొమ్మిది రోజులలో భక్తులు మాంసం, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినకూడదని తెలిపారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించదని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed