చర్లగూడెం ప్రాజెక్టుపై సినిమా షూటింగ్

by S Gopi |
చర్లగూడెం ప్రాజెక్టుపై సినిమా షూటింగ్
X

దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్న గూడెం ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న చర్లగూడెం ప్రాజెక్టుపై మంగళవారం మైకేల్ సినిమా షూటింగ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రంలో హీరోయిన్ పై రౌడీలు ఏడిపించే సన్నివేశంలో హీరో ఎదిరించే ఫైట్ల సీన్లను చిత్రీకరించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న సినిమా షూటింగ్ మంగళవారం ముగిసింది. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ దివాన్స్ కౌశిక్, వరుణ్ సందేశ్, ఆర్తి మామ, అనీష్ కురువిల్లా నటించే చిత్రానికి నిర్మాత భరత్ చౌదరి పుష్కర రామ్మోహన్రావు, దర్శకుడు రంజిత్ జయ కోడి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ చిత్రం జూన్ వరకు పూర్తిచేసి జూలైలో మూడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రేమకథా చిత్రాల కంటే ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉన్నట్లు దర్శకుడు తెలిపారు. సినిమా షూటింగ్ జరుగుతుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సినిమా షూటింగ్ దగ్గరికి తరలిరావడంతో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Next Story