కిలిమంజారో పర్వతాన్ని ఎక్కే సత్తా ఉన్నా.. స్తోమత లేదు!

by Web Desk |
కిలిమంజారో పర్వతాన్ని ఎక్కే సత్తా ఉన్నా.. స్తోమత లేదు!
X

దిశ, కల్లూరు(పెనుబల్లి): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన వియమ్ బంజర బర్మావత్ మోతి కుమార్ కు చిన్నతనం నుండి పర్వతారోహణ మీద ఆసక్తి ఎక్కువ. అందులో శిక్షణ పొంది దక్షిణాఫ్రికాలోని 5895 మీటర్ల ఎత్తుగల మౌంట్ కిలిమంజారో పర్వతారోహణకు ఈ నెల 19న వెళ్ళడానికి అనుమతులతో సిద్ధంగా ఉన్నాడు. కానీ తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆర్థిక సహాయం కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాడు.




మోతి కుమార్ మాటల్లో నేను నిరుపేద లంబాడి గిరిజనకు చెందిన వాడను, నేను డీపీడీఏ పూర్తి చేసి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను. అనేక సందర్భాల్లో నేను జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి కోకో, కరాటే, కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాను. రాష్ట్రస్థాయిలో లాంగ్ జంప్, కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాను. ఆసక్తితో పర్వతాన్ని అధిరోహించటానికి రాక్ క్లైమింగ్ స్కూల్ భువనగిరి యాదాద్రి జిల్లాలో శిక్షణ పొందాను.

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి నాకు సుమారుగా రూ.3,20,000 ఖర్చు అవుతుందని తెలిపారు. కాబట్టి నా యందు దయతో దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా ఫోన్ నెంబరు 9346433658. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ దయచేసి మీ సహాయా సహకారాన్ని అందించి నన్ను ఆదరిస్తారని వేడుకుంటున్నాను.

Advertisement

Next Story

Most Viewed