- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీల కీలక డిమాండ్లు
దిశ, తెలంగాణ బ్యూరో: శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీలు పలు డిమాండ్లు చేశారు. సమస్యలు చెప్పుకుంటూ పరిష్కారం చేయాలని కోరారు.
= ఎమ్మెల్సీ ఫారుక్హుస్సేన్:
''త్వరలో రంజాన్ పండుగ రానున్నది. దయచేసి మజీద్‌లలో సౌకర్యాలు కల్పించాలి. నీళ్లు, పవర్, సెక్యూరిటీలను ఇవ్వాలి. పెత్త ఎత్తున జనసమూహాలు ఏర్పడే నేపథ్యంలో పోలీస్‌లు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలివ్వండి''
= ఎమ్మెల్సీ భాను ప్రసాద్:
"వరంగల్జిల్లాలోని 1996 బ్యాచ్పోలీస్అధికారుల ప్రమోషన్లలో చిక్కులు ఏర్పడ్డాయి. దీని వలన జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే దాన్ని పరిష్కరించగలరు''
= ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం:
"గొర్రెల స్కీం కోసం బడ్జెట్‌లో పెట్టిన వెయ్యి కోట్లు సరిపోవు. 4-5 వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గొర్రెల స్కీంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది.''
= ఎమ్మెల్సీ వాణీదేవి:
"రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఎన్నడూ ప్రారంభిస్తారు. స్పష్టత లేక ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. సీట్ల సంఖ్యను ఎలా కేటాయిస్తారు? మహిళా యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన చేయాల్సిన అవసరం ఉన్నది.''
= ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి:
"రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్బుతంగా అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ బడుగుల బాహుబలి. రైతు బంధు కింత ఏకంగా రూ.50 వేల కోట్లను ఖర్చు చేశాం. హుజూరాబాద్‌లో అర్హులందరికీ దళిత బంధు అందింది. మిగతా జిల్లాల్లోనూ సీఎం ఆదేశాలతో అందించే ప్రయత్నం చేస్తాం''
= ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి:
''1986లో ఉమ్మడి మెదక్ జిల్లాలో కట్టిన హల్రీ ప్రాజెక్టు ద్వారా కేవలం వెయ్యి ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. దీంతో రూ. 24 కోట్లను మంజూరు చేసి పూడిక, కాల్వ మరమ్మతులు చేపడితే ఏకంగా 2 వేల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని పరిష్కరించాలి''
= ఎమ్మెల్సీ నర్సిరెడ్డి:
''సెకండరీ విద్య విభాగంలో ప్రమోషన్లు లేవు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని అర్హులందరి జాబితా తయారు చేయాలి. వీలైనంత వేగంగా పదోన్నతులు కల్పించాలి.''