కేసీఆర్ ఆ దమ్ము లేకపోతే సీఎం పదవి నుండి దిగిపో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Satheesh |
కేసీఆర్ ఆ దమ్ము లేకపోతే సీఎం పదవి నుండి దిగిపో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల టౌన్: కేసీఆర్ మీరు కమీషన్ తీసుకొని.. మాకు రెండు వేల కోట్లు ఇచ్చి, వారం రోజులు గడువు ఇస్తే.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి.. కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలకు నిరసనగా రాయికల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కొనే దమ్ము లేకపోతే సీఎం పదవి నుంచి కేసీఆర్ నువ్వు దిగిపో అని విమర్శించారు.

అదేవిధంగా ఇటు పెట్రోల్, డీజిల్‌తో పాటు సిలిండర్ ధర పెంచడంతో సామాన్యులు విలవిలలాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి పేద ప్రజలను కోలుకోకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల మేర గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అందజేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతులను వరి ధాన్యం వద్దంటూ చెప్పిన కేసీఆర్.. కాలేశ్వరం జలాలు రైతుల కోసమే అంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Advertisement

Next Story