ఆమెలా ఎవరూ ఉండలేరు.. కంగనాపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |
ఆమెలా ఎవరూ ఉండలేరు.. కంగనాపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరా చోప్రా (Mira Chopra).. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను కంగనా (Kangana)కు పెద్ద ఫ్యాన్‌ను. ఆమె కరెక్ట్ టైంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టి సక్సెస్ సాధించారు. సినీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో రాణించడం సంతోషంగా ఉంది. అక్కడ కూడా కంగన తన మార్కును చూపుతారు. ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. వాటన్నిటి తట్టుకుని నిలబడ్డారు. అలాగే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే సమస్యలు వస్తాయని తెలిసిన.. వాటికి తలవంచి తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వదులుకోలేదు. అసలు ఆమెలా ఎవరూ ఉండలేరు. ఏ విషయంలోనైనా మనసులో ఉన్నది చెప్పే ఆమె.. ప్రజెంట్ రాజకీయాల్లో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరని నేను నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed