ప్రజారోగ్య విషయంలో వారి సేవలు ఎంతో కీలకం: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Satheesh |
ప్రజారోగ్య విషయంలో వారి సేవలు ఎంతో కీలకం: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: రాష్ట్రంలో ఆశా వర్కర్లు అందిస్తున్న ప్రజా ఆరోగ్య సేవలు ఎంతో కీలకం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో 748 మంది ఆశాకార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ లను బహుకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారి సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ ఆశా వర్కర్లకు వేతనాలను పెంచడం గాని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పీఆర్సీలో భాగం కల్పించడం, స్మార్ట్ ఫోన్‌లను అందిస్తూ మరింత ప్రోత్సహాన్ని అందిస్తున్నారని అన్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా సౌకర్యాలు, సదుపాయల కల్పనలో తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుందని తెలిపారు. ఆశా కార్యకర్తలు అందించే సేవలు గొప్పవని, నిర్ధేశించిన ప్రతి లక్ష్యాన్ని సాధించుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడంలో ఆశా వర్కర్లు ముందున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రవి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, డీఎంహెచ్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed