యాదాద్రి తరహాలో ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీష్ రెడ్డి

by Satheesh |
యాదాద్రి తరహాలో ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీయోగానంద లక్ష్మీ నృసింహస్వామి దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి చాంబర్‌లో దేవాలయ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, దేవాదాయ శాఖ ఉన్నాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న 40 కాళ్ల మండప నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని సూచించారు. యాదాద్రి తరహాలో అర్వపల్లి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు రూ.1కోటి 20 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో పాటు.. తాను కూడా వ్యక్తిగతంగా తన తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ స్మారకార్థం మహా రాజగోపురం స్వంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ.. ఎంతో ప్రాశస్త్యం కలిగిన అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ అభివృద్ధి కొరకు కావలసిన నిధుల కోసం మంత్రి జగదీష్ రెడ్డి సహాకారంతో సీఎం కేసీఆర్‌ను త్వరలోనే కలుస్తానన్నారు. ఆయన స్వంతంగా రూ.20 లక్షలతో ధ్వజ స్థంభాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed