సీఎం జగన్ భజనలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి: ఆచంట సునీత

by Manoj |
సీఎం జగన్ భజనలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి: ఆచంట సునీత
X

దిశ, ఏపీ బ్యూరో : సీఎం జగన్ పాలనలో మహిళా సంక్షేమం, భద్రత.. గాల్లో దీపంగా మారాయని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత వేధింపులకు బలైన నాగలక్ష్మి కుటుంబానికి సీఎం జగన్ ఏం న్యాయం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ సిబ్బంది ఏఎన్‌‌ఎంలు, ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వారిని పోలీసులతో అణచి వేయడమేనా? అని ప్రశ్నించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏనాడైనా అంగన్ వాడీ కేంద్రాల దుస్థితి గురించి ఆలోచించారా? అని నిలదీశారు. సరైన ఆహారం లేక నాసిరకం పదార్థాలు తిని పేద పిల్లలు ఆసుపత్రుల పాలవుతుంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, సీఎం జగన్ భజనలో మునిగి తేలుతున్నారని ఎద్దెవా చేశారు.

Advertisement

Next Story