- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరికొత్త 'జెడ్ఎస్' ఎలక్ట్రిక్ కారు వెర్షన్‌ను విడుదల చేసిన ఎంజీ మోటార్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ కారు మోడల్ జెడ్ఎస్-2022 వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మొదటిసారిగా 2020లో మొదటి ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా కంపెనీ ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తున్నామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంట్రీ లెవల్‌లో 'ఎక్సైట్' పేరుతో తీసుకొచ్చిన వేరియంట్ ధరను రూ. 21.99 లక్షలుగా, టాప్ ఫీచర్లతో వచ్చే 'ఎక్స్‌క్లూజివ్' వేరియంట్ ధరను రూ. 25.88 లక్షలుగా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. సరికొత్తగా తెస్తున్న జెడ్ఎస్ ఈవీ 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుండగా, ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 461 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇదివరకు ఉన్న వెర్షన్ రూ. 419 కిలోమీటర్లతో పోలిస్తే ఇది 42 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అదేవిధంగా కొత్త వాహనం కేవలం 8.5 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వివరించింది. ఇక, ఈ సరికొత్త మోడల్ కారులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, సన్‌రూఫ్, కనెక్టెడ్ టెక్నాలజీతో పాటు ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన ఆరు ఎయిర్‌బ్యాగులు, ఆటోమెటిక్ హెడ్‌ల్యాంప్స్ లాంటి కొత్త ఫీచర్లన్నీ అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.