- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ భరోసాతో సినీ పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తుంది: మెగాస్టార్
దిశ, ఏపీ బ్యూరో: సినీ పరిశ్రమ ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
'తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణం లో చర్చలు జరిపి.. సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యచరణను సూచిస్తూ..ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగ ఉంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరోమారు కృతజ్ఞతలు.
త్వరలోనే అధికారికంగా పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చిన భరోసాతో మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయపూర్వక ఆనందాన్ని తెలిజేస్తూ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను' అని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.