‘నీ వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను’.. మరోస్టార్ హీరోకు మనసులోని మాట డైరెక్ట్‌గా చెప్పేసిన మెగాస్టార్..!

by Anjali |   ( Updated:2024-10-13 05:18:25.0  )
‘నీ వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను’..  మరోస్టార్ హీరోకు మనసులోని మాట డైరెక్ట్‌గా చెప్పేసిన మెగాస్టార్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు.. ఎంతో మంది ఆదర్శంగా తీసుకునే మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈయన మంచితనానికి కోట్లాది మంది ప్రజలు తమ గుండెల్లో చిరుకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ హీరో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

టాలీవుడ్‌లో చిరు ఏ రేంజ్‌లో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అప్పట్లో మెగాస్టార్‌కు సాటి మరొకరు లేరని చెప్పుకోవచ్చు. ఆయన నటన డాన్స్ కు ఒక్కొక్కరు ఫిదా అయిపోయేవారు. అంతేకాకుండా అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరో కూడా చిరునే. అయితే ఇంతటి చిరు ఓ స్టార్ హీరో కారణంగా నిద్రలేని రాత్రుళ్లు గడిపారట. మరీ ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిగా విషయం తెలిసిందే.

కాగా అందులో కమల్ హాసన్ నటనకు మెగాస్టార్ ఫిదా అయిపోయారట. అస్సలు ఇంత బాగా నటించారు.. ఈయన కమల్ హాసనేనా అనే సందేహం చిరులో కలిగిందట. కాగా ఈ మూవీ వీక్షించాక చిరుకు నిద్ర పట్టలేదట. ఈ విషయం స్వయంగా మెగాస్టారే కమల్ హాసన్ కు చెప్పారని సమాచారం. వీరిద్దరు మీట్ అయినప్పుడు చిరు.. కమల్ హాసన్ ను హగ్ చేసుకుని, అసలు ఎలా సాధ్యమైంది? అంతా బాగా ఎలా నటించావు అంటూ పొగడ్తలతో ముంచెత్తారట. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : Balakrishna vs Ram Charan: ఈ సారి చరణ్‌తో పోటీకి సిద్దమవుతున్న బాలయ్య.

Advertisement

Next Story