ఈ నెల 26న మెగా జాబ్ మేళా..

by Vinod kumar |
ఈ నెల 26న మెగా జాబ్ మేళా..
X

దిశ, హన్మకొండ టౌన్: హన్మకొండ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి సోమవారం తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా హన్మకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.


హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో నెరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణం వేదికగా ఈ నెల 26వ తేదిన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించబడే ఈ జాబ్ మేళాకు పదవ తరగతి నుండి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తో ఏదైనా విభాగంలో డిగ్రీ చదివిన యువతకు వెయ్యికి పైగా ఉద్యోగాలను అందించేందుకు గాను ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, ఇస్లక్షన్, టెలికాం, మార్కెటింగ్ హోటల్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్ మొదలైన విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనేందుకుగాను 40కి పైగా వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు అర్హత కలిగిన యువతకు కనీసం 12వేల జీతంతో కూడిన ఉద్యోగ అవకాశం ఉందన్నారు.


జాబ్ మేళాకు హాజరయ్యే వారు అదే రోజున తమ పేర్లను ముందుగానే జాబ్ మేళా నిర్వహించే ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వుంటుందని. హజరయ్యే యువతి యువకులు తమ వెంట బయెడేటా (ఐదు కాపీలు), విద్యకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలతో పాటు, ఆధార్ కార్డుకు ఒరిజినల్.. జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తమ వెంట తెచ్చుకోవాలన్నారు. చదువుకున్న యువతి, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోని పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story