- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే విమానంలో మెగా-అక్కినేని ప్రముఖ హీరోలు.. ఎక్కడికి వెళ్లారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులు తెగ సంబరపడిపోతారు. కాగా నిన్న (అక్టోబరు 13)తెలుగు ప్రముఖ హీరోలైన నాగార్జున-మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపించారు. కింగ్ నాగార్జున, చిరు నడుచుకుంటూ వెళ్తోన్న వీడియో తీసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఎక్కడికెళ్తున్నారని జనాలు ఆరా తీయడం మొదలు పెట్టగా.. ఇద్దరు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లినట్లు తెలిసింది. కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత అయిన టీఎస్. కళ్యాణ్ రామన్ ఇంటికి ఆహ్వానం మేరకు వెళ్లారు. కేరళలోని త్రిశూర్‌లో ఉన్న రామన్ దసరా సెలబ్రేషన్స్ కోసం కింగ్ అండ్ మెగాస్టార్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారట.
దీంతో టాలీవుడ్ హీరోలు ఈ సంబరాల్లో పాల్గొని చాలా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ వీక్షించిన నెటిజన్లు నాగార్జున-చిరంజీవి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉందో ఈ ఫొటోలు చూస్తే అర్థమౌతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరిని మరోసారి ఒకే ఫ్రేమ్ లో చూడటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కళ్యాణ్ జ్యువెల్లర్స్ కు ఎప్పటి నుంచో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే.