మెదక్ వాసులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మంత్రి హరీష్ రావు..

by Satheesh |   ( Updated:2022-03-07 12:20:54.0  )
మెదక్ వాసులకు గుడ్ న్యూస్.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మంత్రి హరీష్ రావు..
X

దిశ, మెదక్: 2023వ సంవత్సరంలో మెదక్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీంతో మెదక్ జిల్లా డాక్టర్లు, ఐఎంఏ ప్రతినిధులు, డాక్టర్లు సురేందర్, చంద్ర శేఖర్‌లు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, చౌరస్తాలో టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్‌లు, నాయకులు స్వీట్లు పంచిపెట్టారు.

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే..

మెదక్‌కు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు.. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ సహకరించిన జిల్లా మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story