జవాన్‌ను హత్య చేసిన మావోయిస్ట్‌లు

by Javid Pasha |
జవాన్‌ను హత్య చేసిన మావోయిస్ట్‌లు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఒక జవాన్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బోదరాస్ గ్రామానికి చెందిన ఓ జవాన్ జాతరకు హాజరై వెళుతుండగా మార్గమధ్యలో మావోయిస్టులు అతని పట్టుకొని హత్య చేసినట్లు తెలిసింది. మృతదేహం వద్ద కరపత్రాలు మావోయిస్టులు వదిలి వెళ్లారు. కుకనార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story