- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు స్వేచ్ఛనిచ్చింది అంబేద్కర్: మంద కృష్ణ మాదిగ
దిశ, భీమ్‌గల్: మన దేశంలో మహిళలకు స్వేచ్ఛనిచ్చింది బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు. సోమవారం భీమ్‌గల్ మండల కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయనతో పాటు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అన్న మాటను త్రీవంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే వచ్చిందని.. ఇది కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా పదవులు అనుభవిస్తూ.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేకి అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అంబేద్కర్ జయంతి సందర్భంగా ఒక్కసారి కూడా నివాళులు అర్పించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అంబేడ్కర్ విగ్రహం తీసివేసి కేసీఆర్ విగ్రహం పెట్టుకున్నారని విమర్శించారు.
దీని బట్టి కేసీఆర్‌కు అంబేడ్కర్ అంటే ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు అని అన్నారు. ఈ నెల 9 తేదీన హైదరాబాద్ లో జరిగే రాజ్యాంగ పరిరక్షణ సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. అనంతరం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. పరిపాలన చేతకాకపోతే దిగిపోండి.. అంతే కానీ రాజ్యాంగం మార్చుతాం అంటే పాతాళానికి తొక్కుతాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేజే నర్సయ్య, నాగభూషణం, గణేష్, అనంత రావు, వివిధ గ్రామాల దళిత, బహుజన ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.