- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త అనుకుని వేరే వ్యక్తితో చాటింగ్.. న్యూడ్ ఫొటోలు పంపినంక అసలు విషయం తెలిసి..
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఆ అకౌంట్ తన భర్తదే అనుకుని ప్రతిరోజూ చాటింగ్ చేసేది. అంతేకాదు.. అతను అడిగాడని ఆమె ప్రైవేట్ ఫొటోలు కూడా పంపింది. ఆ ఫొటోలను పంపింది తన భర్తకు కాదు.. మరో వ్యక్తికి అని తెలిసి షాకయ్యింది. పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని మలాడ్ దిన్ దోషి ఏరియాలో ఓ అపార్టుమెంటులో భార్యాభర్తలు నివాసముంటున్నారు. అయితే, ఆమె తన భర్త అనుకుని వేరే వ్యక్తితో సోషల్ మీడియాలో చాట్ చేసేది. అలా ప్రతిరోజూ చాట్ చేస్తూ ఉండేది. ఇలా చాట్ చేస్తున్న క్రమంలో న్యూడ్ ఫొటోలు పంపమని అడిగాడు. ఆమె తన భర్తే కదా అనుకుని పంపింది. అలా ప్రతి రోజూ అలాంటి ఫొటోలు పంపాలని అడగడంతో విసుగుచెందిన ఆమె డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన భర్తపై సీరియస్ అయ్యింది. ఎందుకు పదే పదే ఆ ఫొటోలు అడుగుతున్నావని ప్రశ్నించింది. వెంటనే అతను రెస్పాండవుతూ అసలు తనకు సోషల్ మీడియాలో అకౌంటే లేదని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యింది. అదేంటి అలా అంటున్నావ్.. రోజూ నాతో చాట్ చేస్తున్నావ్.. డీపీ కూడా నీదే ఉంది కదా అని ప్రశ్నించింది. అది తనది కాదని అతను మరోసారి సమాధానమిచ్చాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి ఎవరా అని ఆరా తీయగా పక్కింటి యువకుడే అని తేలింది. ఆమె అకౌంట్ లో ఉన్న ఫొటోలల్లో ఆమె భర్త ఫొటోను తీసుకుని, ఒక కొత్త అకౌంట్ ను ఓపెన్ చేసి ఆ ఫొటోను డీపీగా పెట్టి, ఆ తర్వాత ఆమెకు రిక్వెస్ట్ పెట్టడంతో ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిందని.. అప్పటి నుంచి ఆమెతో చాట్ చేస్తున్నానని ఆ యువకుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎందుకు ఇలా చేశావని పోలీసులు ప్రశ్నించగా గతంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరగడంతో కక్ష మీద అలా చేసినట్లు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.