- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవం మహేష్ రూపేనా.. సూపర్‌స్టార్‌కు చేతులెత్తి మొక్కిన నటి
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కాగా తన 'జీఎంభీ' ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 1200 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించిన హీరో.. ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన 'ప్యూర్ లిటిల్ హార్ట్స్' ఫౌండేషన్‌తో చేతులు కలిపారు.
ఈ విషయంపై స్పందించిన నటి, ఏపీ ఎమ్మెల్యే రోజా మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు చెప్పిన రోజా.. 'చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్ బాబుకు హ్యాట్సాఫ్' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రెయిన్ బో ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి మీడియాతో మాట్లాడిన మహేష్ వీడియోను షేర్ చేయడం విశేషం. ఇక రోజా ట్వీట్‌పై మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు అండగా నిలుస్తున్న హీరోను దైవం మహేష్ రూపేనా అంటూ పొగిడేస్తున్నారు. ఇక లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలిసి తొలి విడతలో 125 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు.
❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022