ఐవీఎఫ్ ప్రక్రియలో పుట్టిన లేగ దూడ..

by Manoj |
ఐవీఎఫ్ ప్రక్రియలో పుట్టిన లేగ దూడ..
X

దిశ, ఫీచర్స్ : పంజాబ్, లూథియానాలోని గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ (GADVASU) శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ ప్రక్రియలో లేగదూడను పుట్టించారు. అండ సేకరణ, ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్(OPU IVF) టెక్నిక్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పిండాన్ని ఆవు కడుపులోకి బదిలీ చేయడం ద్వారా విజయవంతంగా సాహివాల్ దూడను ఉత్పత్తి చేశారు. కాగా OPU IVF పద్ధతిలో పంజాబ్‌లో ఉత్పత్తి చేయబడిన మొదటి దూడ ఇదే కావడం విశేషం.

ఈ పురోగతి గురించి డాక్టర్ ఇందర్‌జీత్ సింగ్ మాట్లాడుతూ.. 'పాలిండ్లలో ఒక్కో దాని నుంచి 4,000 కిలోలకు పైగా పాలను ఉత్పత్తి చేసే ఎలైట్ సాహివాల్ ఆవు నుంచి అండాలు గుడ్లు సేకరించబడ్డాయి. IVF కోసం వంశపారంపర్యంగా అధిక సామర్థ్యం గల సాహివాల్ ఎద్దు నుంచి లింగ క్రమబద్ధీకరించబడిన వీర్యం ఉపయోగించబడింది. ఉత్పత్తి చేయబడిన పిండాలను ఈస్ట్రస్ సైకిల్‌లో 7వ రోజున సరోగేట్ డ్యామ్స్‌గా ఉపయోగించిన సంకరజాతి ఆవుల గర్భాశయంలో అమర్చారు. ఫలితంగా తొమ్మిది నెలల తర్వాత ఎలైట్ సాహివాల్ దూడ జన్మించింది. ప్రస్తుతం దూడ ఆరోగ్యంగా ఉంది' అన్నారు.

ఈ డెవలప్‌మెంట్‌లో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ నరీందర్ సింగ్, డాక్టర్ గుర్జోత్ కౌర్‌ మావీని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఇందర్‌జీత్ సింగ్ అభినందించారు. ఇండియాలో ఇప్పటివరకు కొన్ని ల్యాబ్స్ మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించి విజయవంతంగా ప్రత్యక్ష దూడలను ఉత్పత్తి చేయగలిగాయి. GADVASU శాస్త్రవేత్తల విషయానికొస్తే.. సాహివాల్ ఆవుల నుంచి OPU IVF పిండాలను ఉపయోగించి 37 గర్భాలను స్థాపించగా, అవి త్వరలోనే దూడలకు జన్మనివ్వనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed