విద్యుత్ సరఫరాలో అంతరాయం.. సహకరించాలన్న ఏఈ

by Javid Pasha |
విద్యుత్ సరఫరాలో అంతరాయం.. సహకరించాలన్న ఏఈ
X

దిశ, లోకేశ్వరం: ఈ నెల 13న మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. అందుకు విద్యుత్ లైన్లలో మరమ్మత్తులే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ మరమ్మత్తుల కారణంగా 12 గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలవనుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. మన్మధ్, బిలోలి, హవర్గా, రాజురా, బాగా పూర్, సాథ్ గాం, హాధ్ గాం, ఎడ్డూర్, పొట్ పెళ్లి, గడ్ ఛాంద, బామ్ని, పిప్రి గ్రామాల్లో ఈ నాలుగంటల విద్యుత్ కోత జరగనుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed