Mandana Karimi : ఒక్కసారి చేస్తేనే కడుపొచ్చిందా.. అబార్షన్ చేయించుకో.. నటిపై డైరెక్టర్ ఒత్తిడి

by Mahesh |   ( Updated:2022-04-12 07:19:18.0  )
Mandana Karimi : ఒక్కసారి చేస్తేనే కడుపొచ్చిందా.. అబార్షన్ చేయించుకో.. నటిపై డైరెక్టర్ ఒత్తిడి
X

దిశ, సినిమా : 'లాక్ అప్' రియాలిటీ షో.. బ్యూటీనెస్ ఆఫ్ లైఫ్‌తో పాటు జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తోంది. ప్రతీ వీకెండ్ ఎపిసోడ్‌లో ఎవిక్షన్ నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్లు చెప్పే సీక్రెట్స్ వింటే జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఈ వారం మందనా కరిమి చెప్పిన రహస్యం వింటే మతి పోతుంది. అమ్మాయిగా పుడితే ఇన్ని బాధలు ఎదుర్కోవాలా? అనిపిస్తుంది.

విషయానికొస్తే.. లాక్‌డౌన్ ముందే భర్తతో విడిపోయిన మందన, మరో మగాడి చేతిలో మోసపోకూడదని అనుకుందట. కానీ ఈ టైమ్‌లోనే సొసైటీ గొప్పగా మాట్లాడుకునే ఓ ఫిల్మ్ మేకర్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపింది. అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడే ఆయనతో తనకు కొద్దికాలంలోనే సాన్నిహిత్యం ఏర్పడగా.. లాక్‌డౌన్‌లో కలిసే ఉన్నామని తెలిపింది.

ఈ క్రమంలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని.. కానీ అతడు తండ్రి అయ్యేందుకు సిద్ధంగా లేనని, 33 ఏళ్ల వయసులోనూ ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదని, వెంటనే అబార్షన్ చేయించాలని పట్టుబట్టినట్లు వివరించింది. అయితే భర్త నుంచి విడాకులు మంజూరు కాకపోవడం వల్ల ఈ రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచాల్సి వచ్చిందన్న మందన.. తన ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా ఆ ఫిల్మ్ మేకర్ వినిపించుకో కపోవడంతో అబార్షన్ చేయించుకుని, దూరంగా ఉంటున్నానని చెప్పింది.

ఇవి కూడా చదవండి : గే ఫాదర్స్.. బెస్ట్ క్వీర్ పేరెంట్స్‌గా తమిళియన్ - ఇటాలియన్

Advertisement

Next Story