- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సాఫీస్ వద్ద RRR సునామీ.. రూ.500 కోట్లు సంపాదించిన భారత సినిమాలివే?
దిశ, వెబ్‌డెస్క్: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. గత మూడ్రోజులుగా భారత చలనచిత్ర రంగాన్ని కుదిపేస్తూ.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో సినిమాను థియేటర్లలో చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా అన్ని రాష్ట్రాల్లోని అభిమానులూ పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటిరోజే ఆదరగొట్టి స్టన్నింగ్ కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 223 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా కేవలం మూడ్రోజుల్లోనే రూ.500 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మేరకు చిత్రం యూనిట్ ఆర్ఆర్ఆర్ ఊచకోత పేరుతో రూ.500 కలెక్షన్లు రాబట్టినట్లు పోస్టర్ రూపంలో విడుదల చేసింది. అయితే, బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్లు వసూలు చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే అది సునాయాసంగా చేసి చూపించాయి. అలా ఇప్పటి వరకు రూ. 500 కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఇండియన్ సినిమాలు రాబట్టిన కలెక్షన్లు..
1. బాహుబలి -2 : రూ.1810 కోట్లు
2. అమీర్ ఖాన్ దంగల్ : రూ.1200 కోట్లు
3. భజరంగీ భాయిజాన్ : రూ.969 కోట్లు
4. సీక్రెట్ సూపర్ స్టార్ : రూ.966 కోట్లు
5. అమీర్ ఖాన్ (PK) : రూ. 832 కోట్లు
6. రోబో 2.0 : రూ. 800 కోట్లు
7. బాహుబలి : రూ. 650 కోట్లు
8. సల్మాన్ 'సుల్తాన్' : రూ. 623 కోట్లు
9. సంజు : రూ. 586 కోట్లు
10. పద్మావత్ : రూ. 585 కోట్లు
11. టైగర్ జిందా హై : రూ. 566 కోట్లు
12. ధూమ్ 3 : రూ. 556 కోట్లు
13. ఆర్ఆర్ఆర్ : రూ.500 కోట్లు