Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రలో రెస్క్యూ సేవలు ముగిశాయి

by S Gopi |   ( Updated:2022-07-14 13:15:00.0  )
Lieutenant Governor Manoj Sinha says Rescue Operations Are Over in Amarnath Yatra
X

శ్రీనగర్: Lieutenant Governor Manoj Sinha says Rescue Operations Are Over in Amarnath Yatra| అమర్‌నాథ్ యాత్రలో వరద ప్రమాదం జరిగిన ఆరు రోజులకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక ప్రకటన చేశారు. ఆచూకీ లేకుండా పోయినవారు ఇంకెవరు లేరని, రెస్క్యూ చర్యలు ముగిసాయని అన్నారు. 'అనేకమంది ప్రజలు గల్లంతయ్యారని కథనాలు వచ్చాయి. వాస్తవానికి హెల్ప్ లైన్, ఆలయ బోర్డు సుమారు 200 మంది ఆచూకీ గల్లంతైనట్లు ఫోన్లు వచ్చాయి. కేవలం నాలుగు రోజుల్లోనే వారందరిని గుర్తించాం' అని చెప్పారు. కాగా, ఈ ఘటనలో 55 మంది గాయపడగా, 53 మంది కోలుకోగా, మరో ఇద్దరు శ్రీనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 మంది మృతదేహాలను ఆయా రాష్ట్రాల్లోని కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్పారు. మరో కుటుంబం మాత్రమే ఆంత్యక్రియలను ఇక్కడే నిర్వహించ తలచిందని తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు ఆలయ బోర్డు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలనుకున్నప్పటికీ, మరో రూ.5 లక్షలు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలో వరదలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నష్టం తగ్గిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్యానెల్ ఆదేశాల మేరకే పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రోజుకు 10వేల మందిని అనుమతిస్తున్నామని చెప్పారు. కాగా, ఇప్పటివరకు 1.5 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.

Also Read: కేంద్రాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్

Advertisement

Next Story

Most Viewed