Nayanthara: స్టన్నింగ్ లుక్‌తో దర్శనమిచ్చిన లేడీ సూపర్ స్టార్.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-11-14 15:19:21.0  )
Nayanthara: స్టన్నింగ్ లుక్‌తో దర్శనమిచ్చిన లేడీ సూపర్ స్టార్.. ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తెలుగు, హిందీ, తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గత ఏడాది జవాన్(Jawan), అన్నపూరణి(Annapurani) మూవీస్ చేసింది. అయితే అన్నపూరణిలో ఆమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన క్యారెక్టర్ చేసి బిర్యాని వండటంతో వివాదం అయింది.

ప్రజెంట్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ లో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మన్నా గట్టి, డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2 , మూ కుతి అమ్మన్ 2(Moo Kuti Amman 2) వంటి సినిమాల్లోనూ చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు పెడుతోంది. తాజాగా, నయన్ స్టన్నింగ్ లుక్‌(Stunning look)తో ఉన్న పిక్స్ పెట్టి షాకిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ దుస్తులు ధరించిన ఆమె కిల్లింగ్ లుక్స్‌తో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రజెంట్ నయనతార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More ...

Janhvi Kapoor: ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌కు జాన్వీ కపూర్ రివ్యూ.. సమంత రియాక్షన్ ఏంటంటే?





Advertisement

Next Story