- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్ నుండి స్వగ్రామానికి చేరుకున్న కుంటాల యువతి
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన చెపురి అలేఖ్య ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తోంది. తల్లిదండ్రులు శశికళ- పురుషోత్తం గురువారం మధ్యాహ్నమే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని, దాదాపుఏడు ఏనిమిది గంటలపాటు కూతురు రాక కోసం అక్కడే నిరీక్షించారు. ఢిల్లీలో ఉదయమే దిగినప్పటికీ రాకలో కొంత మేర జాప్యం కావడంతో ఇక్కడికి చేరుకునేందుకు ఆలస్యమైంది. స్వగ్రామానికి శుక్రవారం రోజు చేరుకొన్నారు. యుద్ధం ప్రారంభం నుండి భయభ్రాంతులకు గురైన యువతి తల్లి తండ్రులు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూశారు. పది రోజులుగా ఎంతో ఉత్కంఠతో ఉన్న కుటుంబీకులకు, సన్నిహితులకు అలేఖ్య రాకతో హమ్మయ్య అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని స్వదేశానికి వచ్చానని, కేంద్ర ప్రభుత్వ చొరవతో కుంటాలకు చేరుకున్నట్లు తెలిపారు. యువతి తల్లిదండ్రులు దేశ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.