కోవిడ్ వ్యాక్సినేష‌న్ @ 6 కోట్లు

by Mahesh |
కోవిడ్ వ్యాక్సినేష‌న్ @ 6 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోవిడ్ వ్యాక్సినేష‌న్ లో రాష్ట్రం మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు పంపిణీ చేసిన డోసుల సంఖ్య సోమ‌వారం సాయంత్రానికి 6 కోట్లు దాటింది. ఈ సంద‌ర్భంగా వైద్య సిబ్బందికి ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3.11 కోట్ల మందికి మొద‌టి డోస్‌, 2.83 కోట్ల మందికి రెండో డోస్‌, 5.18 ల‌క్ష‌ల మందికి ప్రికాష‌న‌రీ డోసులు పంపిణీ చేయడం జరిగింది. 12-14 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న‌వారికి వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతున్న‌ది. 11.36 ల‌క్ష‌ల మందికి టీకాలు వేయాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు 19 శాతం పూర్త‌యింది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement

Next Story