- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనోడి సత్తా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ వంటలు
దిశ, ఫీచర్స్ : ఆ చేతులు చిన్న వయసులోనే వంట చేస్తుంటే.. 'హాత్ మే హై' అని అమ్మమ్మ ఆటపట్టిస్తుంటే.. భవిష్యత్తులో ఆ వంటకాలే ఉపాధినిస్తాయని, ప్రపంచానికి తన పేరు పరిచయం చేస్తాయని అతనికి తెలియదు. ఇప్పుడు ఆ పిల్లాడు పాపులర్ చెఫ్‌గా ఎదగడమే కాదు.. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 'ఇనాగురల్ డిన్నర్'కు నాయకత్వం వహించి తన టేస్టీ డిషెస్‌తో అందరితో వావ్ అనిపించాడు. ఆ నలభీముడే 1990లో అమెరికాలోని 'కలినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా'(CIA)లో ప్రొఫెషనల్ చెఫ్‌గా పట్టా పొందిన 'మను చంద్ర'. కెరీర్ ప్రారంభంలో ప్రసిద్ధ మిచెలిన్ రెస్టారెంట్లలో పనిచేసిన మను.. 2004లో ఇండియాకు తిరిగొచ్చి న్యూఢిల్లీలోని ది ఆలివ్ బార్‌లో పనిచేశాడు. పదేళ్ల తర్వాత 'మంకీబార్' పేరుతో గ్యాస్ట్రో పబ్‌ను ఇండియాకు పరిచయం చేయడమే కాక ఓ కొత్త రకమైన 'గోడావన్' వైన్‌ను కూడా భారత్‌కు అందించాడు. రెండు దశాబ్దాలకు పైగా కలనరీ రంగంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ ఢిల్లీ వాసి కేన్స్ విశేషాలు సహా తన గురించి మరెన్నో సంగతులు తెలుసుకుందాం.
మను చంద్ర చెఫ్‌గా రాణిస్తూనే ఆంత్రప్రెన్యూర్‌గా కూడా తన కలలు నిజం చేసుకున్నాడు. ఇండియాలో టోస్ట్ అండ్ టానిక్(బెంగళూరు), మంకీబార్(ఢిల్లీ, ముంబై, బెంగళూరు) పేర్లతో ప్రముఖ గ్యాస్ట్రో పబ్స్(బార్, రెస్టారెంట్ అండ్ పబ్)ను ప్రారంభించాడు. ఆ తర్వాత ది సోషల్ కిచెన్ ప్రచారం కోసం జర్మన్ మాడ్యులర్ కిచెన్ బ్రాండ్ నోల్టేతో కలిసి పనిచేశాడు. గోవాలోని సెరెండిపిటీ ఆర్ట్స్ ఫెస్టివల్ అడ్వైజరీ బోర్డులో ఉన్న మనుచంద్ర.. టేస్ట్ సిరీస్‌లతో వంటకాల చుట్టూ ఉన్న దేశీయ సంస్కృతులను అన్వేషించేందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాడు. ఇలా బహుముఖంగా రాణిస్తున్న మను చంద్రకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి 'ఇనాగురల్ డిన్నర్' ప్రిపేర్ చేయాల్సిందిగా ఆహ్వానం అందడంతో ఒక్కసారిగా ఉప్పొంగిపోయాడు. అయితే ఎంత చేయి తిరిగినా వంటగాడైనా.. సెవెన్ స్టార్‌ను మించిన హోటల్స్‌లో రాణించిన చెఫ్ అయినా.. ప్రపంచ నలుమూలలకు చెందిన స్టార్స్, సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్, లీడర్స్ హాజరయ్యే కేన్స్ ఫెస్టివల్‌కు మెనూ తయారుచేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ తన అసిస్టెంట్స్‌కు వీసా ఆలస్యం కావడంతో ఒక్కడే కేన్స్‌కు హాజరై తన మెనూపై కసరత్తులు మొదలెట్టాడు.
ఇనాగురల్ డిన్నర్ ఆహ్వానాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకున్న మను.. మూడు రోజుల పాటు అలుపెరగకుండా తిరిగి స్థానిక ఆహార పదార్థాలపై ఓ అవగాహన తెచ్చుకున్నాడు. అయితే కేన్స్ వంటగదిలోని ఇతర చెఫ్స్ అందరూ అతను ల్యావిష్ అండ్ స్పెషల్ డిషెస్ ప్రిపేర్ చేస్తాడనే భావనలో ఉండగా.. తను మాత్రం వాళ్ల ఆలోచనలకు భిన్నంగా వెళ్లాడు. నిజానికి యుద్ధం ఎంత పెద్దదైనా సరే వాడేవి కత్తులే.. అలాగే ఆహారం ఎవరూ తిన్నా రుచిగా ఉండాలన్నదే సూత్రం. మను కూడా ఇదే ఫార్మూలా నమ్ముకున్నాడు. ఈ మేరకు బాల్యంలో ఇంట్లో భోజనాల వేళ కుటుంబ సభ్యుల మధ్య ఆహారం గురించి జరిగే చర్చలు, దాని చుట్టూ ఉన్న వాదనలు, అవి చేసే విధానాన్ని తలచుకున్నాడు. ఆ అనుభవాలన్నీ తన మనసులో గాఢంగా నాటుకుపోగా.. ఆహారం మనుకు ప్రేమ భాషగా మారింది. కాబట్టి సంవత్సరాల తర్వాత కేన్స్ విందు కోసం మెనూ నిర్ణయించే వేళ.. అది తన మాతృభూమి వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి తీసుకెళ్లేందుకు లభించిన అవకాశంగా భావించాడు.
ఇండియా రుచుల విందు :
చట్నీ, క్రీమ్ ఫ్రైచీతో కూడిన పయాజ్ కి కచోరీ ఎన్ క్రౌట్, పాన్ సీర్డ్ సెయింట్ పియర్(పాపడ్ కి సబ్జీ నూడుల్స్, సీజనల్ వెజిటేబుల్స్ కాధీ సాస్‌పై) గట్టే, మోరెల్ పులావ్ (ఎస్లెట్ పెప్పర్ సలాన్, దోసకాయ, ఆనియన్ కుకుంబర్ వడ్డిస్తారు), బాదం ఫినాన్‌కాన్సిడ్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీలు, కుంకుమ పువ్వు సాస్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, లాల్ మాస్‌తో పాటుగా అందించిన కిచ్డీకి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రారంభ విందుతో పాటు కేన్స్‌లోని ఇండియా పెవిలియన్‌కు కూడా ఆహారాన్ని అందించాడు. దీని కోసం అతను ప్రత్యేకంగా బైట్ సైజ్డ్ కానాప్స్‌ను సృష్టించాడు. వాటితో పాటు కొబ్బరి చట్నీ, బ్రియోచీ బన్స్‌లో వడా పావ్, లిటిల్ బ్లినీస్‌పై వడ్డించే ఫ్రెంచ్ డక్ కాన్ఫిట్ గాలౌటిస్, బురానీ రైతాతో మటన్ బిర్యానీ, చంపారన్ స్టైల్ చట్నీలతో జాక్‌ఫ్రూట్ సమోసాను అందించాడు. దీంతో సెలబ్రిటీలు తమ ఇంటిని గుర్తుచేశావంటూ మనును అభినందించారు.
వంటల్లో భారతీయులు నేర్పరులు :
మెనూ ఒక ఎడారిని సూచిస్తుంది, అది ఒక చైతన్యాన్ని కలిగి ఉంది. మెనూ ద్వారా నేనో ఎడారి కథను చెప్పాలనుకున్నా. ఉదాహరణకు రాజస్థాన్ తీసుకోండి. ఇక్కడ మొక్కలు పెరగవు, చుట్టూ ఇసుక గుట్టలను మినహాయించి దాదాపు ఏమీ కనిపించదు. ఇలాంటి కఠినమైన శుష్క ప్రాంతంలో, మీరు జీవితంలోని దేని గురించి ఆలోచించలేరు. ఆ సమయంలో రంగురంగుల బంధాని తలపాగా ధరించి ఒక వ్యక్తి మీ వైపుగా నడుచుకుంటూ వస్తాడు. ఒక్కసారిగా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అదేవిధమైన అనుభూతిని నా వంటల ద్వారా ప్రతిబింబించాలనుకున్నాను. ఏమీ లేని వాటిలో కూడా ఒక చైతన్యం, రుచి, రంగు ఉంటుంది. ఆ రాత్రి విందులో ప్రతీ అతిథి ఈ వాస్తవాన్ని గుర్తించి భారతీయ ఆహారపు అందం, అనుభూతిని ఆస్వాదిస్తారు. ఇంకో విషయం ఎల్లప్పుడూ ఒక పర్టిక్యులర్ మసాలా కోసం వెతుకుతూ, అది లేకుండా మీ వంటకం అసంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తే, మీరు ఎప్పటికీ మంచి వంటకాన్ని చేయలేరు. ఇతర దేశాల సాంప్రదాయ వంటకాలతోనే మనవైన వంటకాలు చేయడంలో భారతీయులు నేర్పరులు.
- మనుచంద్ర