Salman Khan ప్రశ్నకు ధీటైన సమాధానమిచ్చిన Yash

by Harish |   ( Updated:2022-04-11 11:08:37.0  )
Salman Khan ప్రశ్నకు ధీటైన సమాధానమిచ్చిన Yash
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాల సక్సెస్‌పై ప్రశంసలు కురిపిస్తూనే... 'మన సినిమాలు ఎందుకు ఆడడం లేదు'అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇదే ప్రశ్నను ఓ ఇంటర్వ్యూలో రాఖీ భాయ్ యశ్‌ను ప్రశ్నించగా... 'మనం చేసే సినిమాలు డబ్బింగ్ అని ప్రేక్షకుల మైండ్‌లో ముద్రపడిపోయింది. ఇది ఒక జోక్‌లా రూమర్స్ మొదలైనా చివరికి ప్రపంచం అంతా ఇదే నమ్ముతుంది. అందుకే పాన్ ఇండియా లెవల్‌లో తీసినా అవి అన్ని విధాలుగా ప్రజల ఆకర్షణను రాబట్టాలి. ఇది'కేజీఎఫ్' సినిమాతో మెల్లిగా మొదలైనా.. 'బాహుబలి'తో జక్కన్న నిరూపించాడు. సినిమా అంటే కొత్త నటులను పరిచయం చేయడం కాదు.. కొత్త అంశాలను ప్రజలకు చూపించడం. అందులో సౌత్ ఇప్పుడు ముందంజలో ఉంది. సల్మాన్ సర్ అడిగింది సరైన ప్రశ్నే.. ఉత్తరాది సినిమాలు కూడా అద్భుతంగా ఉంటాయి. మంచి ప్రొడక్షన్ హౌస్ లు రావాలి. ఇండియా మొత్తం పాన్ ఇండియా సినిమాలను విడుదల చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించాలని కోరుకుంటున్నాను. అది అతి త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను' అని యశ్ తెలిపాడు.

Advertisement

Next Story