KGF-2 సంచలనం.. మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

by GSrikanth |
KGF-2 సంచలనం.. మొదటిరోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ బాక్సాఫీస్‌ను కేజీఎఫ్-2 షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.134.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. రానున్న మూడ్రోజులు వీకెండ్ కావడంతో ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఆ రేంజ్ ఉండబోతాయనటంతో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది. కేజీఎఫ్-2లో రాకింగ్ స్టార్ యశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మెట్టు ఎక్కాడనంలోనూ ఏమాత్రం సందేహం లేదు. కాగా, ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Next Story