Kapil Dev: విరాట్ కోహ్లీని జట్టు నుండి ఎందుకు తప్పించకూడదు..? కపిల్ దేవ్

by Satheesh |   ( Updated:2022-07-09 12:50:48.0  )
Kapil Dev Wants Virat Kohli to be Dropped From T20
X

దిశ, వెబ్‌డెస్క్: Kapil Dev Wants Virat Kohli to be Dropped From T20| టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన ఈ రన్ మెషిన్.. ప్రస్తుతం క్రీజ్‌లో నిలదొక్కుకుని పరుగులు చేయడానికి నానాతంటాలు పడుతున్నాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీపై టీమిండిమా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫామ్ లేక పరుగులు చేయడానికి సతమతమవుతోన్న కోహ్లీని జట్టు నుండి ఎందుకు తప్పించకూడని ఆయన ప్రశ్నించాడు. ఫామ్‌లో లేకపోతే ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను సైతం పక్కనబెట్టినప్పడు.. ప్రస్తుతం పరుగులు చేయడానికి తంటాలు పడుతోన్న కోహ్లీని బెంచ్‌కు పరిమితం చేయాలని అన్నాడు. టెస్టుల్లో 450 వికెట్లు పడగొట్టిన స్టార్ బౌలర్ అశ్విన్‌ను పక్కన బెట్టినప్పడు.. చాలా కాలంగా విఫలమవుతోన్న విరాట్‌ను టీ 20 జట్టు నుండి తప్పించాలని కోరాడు. పేరు ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రనా ఫామ్‌లో లేనప్పుడు కూడా అవకాశాలు ఇవ్వొద్దని.. ఇలా చేస్తే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story