Vikram Movie: 50 డేస్ పూర్తి చేసుకున్న విక్రమ్.. మూవీ యూనిట్ సంబరాలు

by Manoj |   ( Updated:2022-07-22 10:53:42.0  )
Kamal Haasans Vikram Movie Completes 50 days
X

దిశ, సినిమా: Kamal Haasan's Vikram Movie Completes 50 days| లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ జూన్ 3న రిలీజై రికార్డులు కొల్లగొట్టింది. త‌మిళ్, తెలుగు, హిందీ భాష‌ల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య కూడా నటించగా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీకి అనిరుధ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కాగా.. చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది మూవీ యూనిట్. ఇక కమల్ అన్ని భాషల్లోనూ థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: రూటు మార్చిన మిల్కీ బ్యూటీ.. తాప్సీని ఆదర్శంగా తీసుకుని!

Advertisement

Next Story