'రాజకీయ ఇస్లాం'కు స్పాన్సర్‌గా కాంగ్రెస్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

by Disha Desk |
రాజకీయ ఇస్లాంకు స్పాన్సర్‌గా కాంగ్రెస్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
X

డెహ్రడూన్: కాంగ్రెస్ పార్టీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఇస్లాంకు స్పాన్సర్‌గా కాంగ్రెస్ మారిందని అన్నారు. ఆ పార్టీలోకి జిన్నా ఆత్మ ప్రవేశించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఉత్తరాఖండ్‌లో బీజేపీ తరుఫున ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు వారు భారత్‌ను దేశంగా కాకుండా రాష్ట్రాల కలయికగా పేర్కొన్నారు. అలాంటపుడు కాంగ్రెస్‌లోకి జిన్నా ఆత్మ ప్రవేశించిందా అనిపిస్తుంది. పక్షపాత రాజకీయాల్లోకి కాంగ్రెస్ ప్రవేశించింది. మదర్సాలు, ముస్లిం యూనివర్సిటీలు ప్రారంభించాలని వారు చెబుతున్నారు. హిజాబ్ ధరించడం కూడా హక్కు గా చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పని అయిపోతుంది' అని అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్‌ఏ‌లోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశ అభివృద్దిని ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూ అవమానపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో ఈ నెల 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed