Jhansi IPS: సీనియర్ నటుడు చేతుల మీదుగా ‘ఝాన్సీ ఐపీఎస్’ ట్రైలర్ లాంచ్..

by sudharani |   ( Updated:2024-10-21 14:57:02.0  )
Jhansi IPS: సీనియర్ నటుడు చేతుల మీదుగా ‘ఝాన్సీ ఐపీఎస్’ ట్రైలర్ లాంచ్..
X

దిశ, సినిమా: లక్ష్మీ రాయ్ (Lakshmi Roy) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’ (Jhansi IPS). గురుప్రసాద్ (Guruprasad) దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Trailer) లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సీనియర్ నటుడు సుమన్ (Suman) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ‘లక్ష్మీ రాయ్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ట్రైలర్ చూశాను. ఫైట్స్ ఆదరగొట్టారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి సినిమాలకు మంచి థియేటర్స్ దొరకాలి. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి నిర్మాత రామకృష్ణ గౌడ్‌కి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. కాగా.. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ త్రిపాత్రాభినయంలో నటించి మెప్పించింది.

నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Ramakrishna Goud) మాట్లాడుతూ.. ‘సుమన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషం (happiness)గా ఉంది. ఇందులో లక్ష్మీ రాయ్ చేసిన త్రిపాత్రాభినయం (triple role) ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ (Fight Master) థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్ష్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. సెన్సార్ (sensor) పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ (November) రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed