ఎయిర్ పోర్టులో IPS ఆఫీసర్ లగేజీ చెకింగ్.. బ్యాగులో అది చూసి అంతా షాక్

by S Gopi |   ( Updated:2022-03-18 03:00:39.0  )
ఎయిర్ పోర్టులో IPS ఆఫీసర్ లగేజీ చెకింగ్.. బ్యాగులో అది చూసి అంతా షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మొదటగా ఆ ఫొటో చూసి షాకవుతున్నారు. ఆ తర్వాత అవునా.. అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలో ఉన్నత పదవిలో ఓ ఐపీఎస్ ఆఫీసర్ కొనసాగుతున్నారు. అయితే, ఆయన తాజాగా జైపూర్ వెళ్లారు. పని ముగిసిన అనంతరం తిరుగు పయనమయ్యారు. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో ఆయన లగేజీని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు. బ్యాగును ఓపెన్ చేసి చూడగా అందులో కేజీల కొద్దీ పచ్చి బఠాణీ కనిపించింది. అయితే, ఈ విషయాన్ని తానే సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసి పేర్కొన్నారు. జైపూర్ లో కేజీ బఠాణీ రూ. 40లకే దొరకడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి తీసుకెళ్లినట్టు అందులో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరలవుతోంది.

Advertisement

Next Story

Most Viewed