'మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను'.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-03-31 12:33:45.0  )
మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: నాది డిఫరెంట్​క్యారెక్టర్. పవర్, పదవుల మీద నాకు ఏనాడు ఆసక్తి లేదు. ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పరిపాలనలో భాగంగా వారి రాజకీయ వ్యూహాల్లో బాగస్వామ్యం పంచుకున్న. మంత్రి పదవి మీద ఇష్టమే లేదు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చి మంత్రి పదవి ఇస్తామన్నా తీసుకోనని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్​నేత జగ్గారెడ్డి అన్నారు.గురువారం సంగారెడ్డిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి జగ్గారెడ్డి హాజరుకాగా ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బాగుండాలని ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జగ్గారెడ్డికి మంత్రి పదవి రావాలని, ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాలని ఫాస్టర్స్ ఆకాంక్షించారు. ఇందుకు స్పందించిన జగ్గారెడ్డి పైవిధంగా స్పందించారు. నాది డిఫరెంట్​మైండ్, డిఫరెంట్​కారెక్టర్​అని జగ్గారెడ్డి అన్నారు. రాజశేఖర్​రెడ్డి, రోశయ్య, కిరణ్​కుమార్​రెడ్డి ముఖ్యమంత్రుల పరిపాలనను దగ్గరినుంచి చూసిన. పరిపాలన విధానంలో వారి రాజకీయ వ్యూహాల్లో నేను భాగస్వామ్యం పంచుకున్నానని జగ్గారెడ్డి గతాన్ని గుర్తు చేశారు. పవర్ మీద పెద్దగా ఆసక్తి లేదు. గెలుపు, ఓటమిని ఒకేలా చూస్తానన్నారు. కొన్నిసార్లు ఓటమి కూడా చాలా మేలు చేస్తుందని తెలిపారు. అధికారం ఉంటే అన్నీ తెలుస్తాయి అనుకుంటాం.

కానీ కొన్ని సార్లు అధికారంలో ఉంటే కొన్ని తెలుస్తాయి.. అధికారం లేకపోతే చాలా విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజం. గెలుపు సేవకు, ఓటమి అనుభవానికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ రెండు ప్రతి రాజకీయ నాయకుడికి అవసరమన్నారు. ఫాస్టర్లకు ఎలాంటి సమస్య వచ్చిన నేను అండగా ఉంటానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఫాస్టర్లు సంతోషంగా ఉంటూ తమ ప్రార్థనలతో ఎంతో మందికి మనోధైర్యాన్ని అందిస్తారని పేర్కొన్నారు. తాను ఎక్కడికి ఏదీ ఆశించి వెళ్లనని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed